: 'వజ్ర బస్సు' ఛార్జీలను తగ్గించిన టీఎస్ఆర్టీసీ!
ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాలు అందించే ఉద్దేశంతో తెలంగాణలో ఇటీవల ప్రారంభించిన వజ్ర బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఈ రోజు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. వజ్ర బస్సు రూట్లలో కూడా పలు మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం ఇకపై హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు రూ.347 ఛార్జీని వసూలు చేస్తారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రూ. 298 వసూలు చేస్తారు. ఈ ధరలు ఇప్పటివరకు ఉన్న ధరలకంటే తగ్గింపు టిక్కెట్ రేట్లతో ఉన్నాయి. ఈ రేట్లను ఎల్లుండి నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.