: గిరిజనులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన జగన్


గిరిజనులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జ‌గ‌న్‌... వై రామవరం మండలం కడారికోటలో గిరిజనులతో మాట్లాడి వారి క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. త‌మ‌కు తాగునీరు స‌రిగా అందడం లేదని గిరిజ‌నులు చెప్పారు. అంతేకాక‌ రేషన్‌ కార్డులు, కులధ్రువీకరణ పత్రాలు, ఉపాధి హామీ కార్డులతో పాటు ప‌లు సౌక‌ర్యాలు కూడా అందుబాటులో ఉండ‌డం లే‌దని చెప్పారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ స‌ర్కారు గిరిజ‌నుల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని అన్నారు. రక్తహీనతతో బాధ‌ప‌డుతున్న వారికి కూడా అండ‌గా నిల‌వ‌కుండా చంద్ర‌బాబు స‌ర్కారు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.       

  • Loading...

More Telugu News