: ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఏడాదికి 2.5 కోట్లు అందుకునే ద్రవిడ్ కి... ఇకపై రూ.5 కోట్లు!
భారత్-ఎ, అండర్-19 క్రికెట్ జట్లకు కోచ్‌గా టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌ను మరో రెండేళ్లపాటు కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రాహుల్ ద్రవిడ్‌కి బీసీసీఐ భారీ పారితోకాన్ని అందించనున్నట్లు తెలిపింది. రాహుల్ ద్రవిడ్ ఆయా జట్లకి శిక్షకుడిగా ఉంటే మంచి ప్రయోజనాలు ఉంటాయని బీసీసీఐ భావిస్తోంది. ఇంతవరకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఏడాదికి రూ. 2.5 కోట్లు అందుకుంటున్నాడు.
ఇప్పుడు ఆయన పారితోషికాన్ని రెట్టింపు చేస్తోన్న సందర్భంగా బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ... జూనియర్లకి క్రికెట్లో మెరుగైన శిక్షణ ఇస్తూ రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు ఎంపికయ్యేలా ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. మరో రెండేళ్ల పాటు అతను ఆయా జట్లకి కోచ్‌గా ఉండేలా ఒప్పందం జరిగిందని అమితాబ్ చౌదరి వివరించారు. రాహుల్ ద్రవిడ్ ఇప్పటి వరకు 10 నెలలు జూనియర్స్ జట్టుకి కోచ్‌గా, రెండు నెలల పాటు ఐపీఎల్‌కి పనిచేసేలా ఒప్పందం చేసుకునేవాడు. ఆ అలవాటుకి భిన్నంగా ఈ సారి మాత్రం రెండేళ్ల వరకు ఒప్పందం కుదిరింది.