: పర్యాటకురాలి చేతిలో ఫోన్ లాక్కుని సెల్పీ దిగిన కోతి!


కోతి చేష్టలంటూ తీసిపారేస్తుంటాం కానీ, ఓ కోతి మాత్రం చాలా తెలివిగా ఓ టూరిస్ట్‌ చేతిలోని సెల్ ఫోన్‌ లాక్కుని మనలాగే సెల్ఫీ దిగిన ఘటన ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌ హామ్‌ లోని జూలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... రెబెక్కా అనే యువతి బర్మింగ్ హామ్ లోని వైల్డ్ లైఫ్ పార్క్ కి వెళ్లింది. అక్కడ జంతువులను తన సెల్ ఫోన్ లో బంధిస్తూ రెబెక్కా బిజీగా ఉంది. ఇంతలో కాపుచిన్‌ జాతికి చెందిన కోతి ఒకటి వేగంగా అక్కడికి వచ్చింది. రెబెక్కా చేతిలోని సెల్ ఫోన్ లాక్కుంది. ఈ సమయంలో రెబెక్కా ఆ కోతిని క్లోజప్ లో ఫొటో తీసేందుకు ప్రయత్నించగా కోతి చేయి సరిగ్గా కెమెరా బటన్ పై పడింది. దీంతో ఆ కోతి సెల్ఫీ వచ్చింది. దానిని చూసిన సిబ్బంది ఆ కోతి పేరు రొమాని అని చెప్పడంతో ఈ ఫొటోని సోషల్ మీడియాలో రెబెక్కా పోస్టు చేసింది. దీంతో రొమాని ఇప్పుడక్కడ సెలబ్రిటీ అయిపోయింది. 

  • Loading...

More Telugu News