: బెంగళూరు-ముంబై విమానంలో లైంగికదాడి.. అరెస్ట్


జూన్ 27వ తేదీన బెంగళూరు నుంచి ముంబైకు వెళుతున్న విమానంలో ఓ మహిళపై తోటి ప్రయాణికుడి లైంగికదాడి వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, విమానం బయల్దేరిన తర్వాత బాధితురాలు నిద్రకు ఉపక్రమించింది. ఆ తర్వాత పక్క సీటులో ఉన్న సబీన్ హంజా అనే వ్యక్తి ఆ మహిళ శరీరాన్ని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ చేష్టలతో నిద్రనుంచి మేల్కొన్న బాధితురాలు షాక్ కు గురైంది. వెంటనే విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, విమానం ముంబైలో ల్యాండ్ కాగానే... సెక్యూరిటీ సిబ్బంది సబీన్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News