: 400 మంది పోలీసు బందోబస్తు నడుమ.. 250 మంది అతిథుల సాక్షిగా ఒక ఇంటివాడైన మెస్సీ!


ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ (30) ఒక ఇంటివాడయ్యాడు. అర్జెంటీనాలోని రొసారియా నగరంలో అత్యంత ఖరీదైన సిటీ సెంట్రల్ కాంప్లెక్స్ లో మెస్సీ వివాహవేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 400 మంది పోలీసుల బందోబస్తు నడుమ, 250 మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో లియోనెల్ మెస్సీ తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి ఆంటోనెల్లా రొక్యూజ్జోని వివాహం చేసుకున్నాడు. పదేళ్ల సహజీవనం అనంతరం, ఇద్దరు కుమారులు కలిగిన తరువాత వీరు వివాహం చేసుకోవడం విశేషం.

వీరి వివాహం ఈ దశాబ్దంలోనే అత్యంత వైభవంగా జరిగిన వేడుకల్లో ఒకటని స్థానికులు పేర్కొంటున్నారు. వివాహానికి హాజరైన అతిధుల కోసం ఇదే కాంప్లెక్సులో ఉన్న పోల్ మన్ హోటల్ లోని 188 రూములను మెస్సీ బుక్ చేయడం విశేషం. వీరి వివాహ తంతు పూర్తయ్యి అతిధులు తమ రూమ్స్ కు వెళ్లే వరకు ఈ కాంప్లెక్స్ పరిసరాల్లోకి స్థానికులను అనుమతించలేదు. వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ పై అతిధులు ఆకట్టుకున్నారు. వివాహానంతరం అర్జెంటీనాలోని ప్రముఖ నాన్ వెజ్ వంటకాలతో కూడిన డిన్నర్ ను అతిథులు ఆస్వాదించారు. 

  • Loading...

More Telugu News