: లింకన్ మాటలు ప్రస్తావిస్తూ ట్రంప్ ను దుమ్మెత్తిపోసిన హ్యారీపోటర్ రచయిత
మహిళా పాత్రికేయురాలిపై వ్యక్తిగత దూషణకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హ్యారీ పోటర్ రచయిత్రి జెకె.రోలింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ట్రంప్ ను దుమ్మెత్తిపోశారు. 'ఒక పురుషుడి శీల, స్వభావం ఎలాంటిదో తెలుసుకోవాలనుకుంటే... ఆయనకు అధికారం ఇవ్వాలి' అంటూ లింకన్ చెప్పిన మాటలను ఆమె ట్వీట్ చేశారు. ఈ కొటేషన్ ట్రంప్ కు బాగా వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు.
దీంతో ఇది వైరల్ అయింది. సుమారు 59,000 మంది దీనిని రీ ట్వీట్ చేయడం విశేషం. అమెరికాలో ప్రసారమయ్యే ఒక టీవీ షోలో ట్రంప్ ప్రభుత్వంపై మహిళా పాత్రికేయురాలు మీకా బ్రిజెన్స్ కే, సహ వ్యాఖ్యాత జో స్కార్ బరో తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్ వారిద్దరినీ ఉద్దేశించి ‘జో సైకో అయితే.. మికాకు ఐక్యూ తక్కువ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రౌలింగ్ మండిపడ్డారు.