: బీఎస్ఎన్ ఎల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కు బంపర్ ఆఫర్!
జులై 1 నుంచి తన పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం మరింత ఆకర్షణీయమైన పథకాలను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టనుంది. పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు దాదాపు 6 రెట్ల డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త ప్లాన్స్ లో ఆరు రెట్ల డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందించనున్నట్టు బీఎస్ఎన్ఎల్ తన ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులకు సమర్ధవంతమైన, సరసమైన సేవలను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ ఆర్.కె. మిట్టల్ పేర్కొన్నారు.
కొత్త ప్లాన్స్ వివరాలు..
* రూ.99 ప్లాన్- 250 ఎంబీ డేటా ఉచితం. ఇంతకు ముందు ఈ సదుపాయం లేదు
* రూ.225 ప్లాన్- 1 జీబీ డేటా ఉచితం. అంతకుముందు కేవలం 200ఎంబీ మాత్రమే ఉచితంగా ఇచ్చేది
* రూ.799 ప్లాన్- 3 జీబీ స్థానంలో 10 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్