: సోమవారం నుంచి తమిళనాడులో మూతపడనున్న థియేటర్లు!
జీఎస్టీకి అదనంగా 30 శాతం మునిసిపల్ ట్యాక్స్ విధించేందుకు తమిళనాడు స్థానిక సంస్థలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అక్కడి థియేటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని థియేటర్లను సోమవారం నుంచి నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ, జీఎస్టీతో పాటు అదనంగా 30 శాతం మునిసిపల్ పన్నును విధిస్తున్నారని, దీంతో మొత్తం పన్ను ఇంచుమించు 60 శాతం వరకు ఉంటుందని, ఈ భారాన్ని భరించలేమని, అందుకే, థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించామని చెప్పారు. కాగా, సినిమా రంగంపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.