: భారత అటార్నీ జనరల్ గా సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ నియామకం
భారత అటార్నీజనరల్ (ఏజీ) గా సీనియర్ న్యాయవాది కె.కె. వేణుగోపాల్ నియమితులయ్యారు. వేణుగోపాల్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఏజీగా ఉన్న ముకుల్ రోహత్గీ పదవీ కాలం ఈ నెల 19తో ముగిసింది. దీంతో, ఆయన స్థానంలో వేణుగోపాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇదిలా ఉండగా, కాంగ్రెసేతర తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య సమరయోధుడు మొరార్జీ దేశాయ్ హయాంలో వేణుగోపాల్ న్యాయ అధికారిగా పనిచేశారు.