: నా భార్య, నేను చాలా హ్యాపీగా ఉండేవాళ్లం: శిరీష భర్త సతీష్ చంద్ర


శిరీష, తాను చాలా హ్యాపీగా ఉండేవాళ్లమని ఆమె భర్త సతీష్ చంద్ర అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తమ ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలూ లేవని అన్నారు. ఈ కేసు ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని, రోజూ మీడియాలో చూపించి, తన భార్య క్యారెక్టర్ పై లేనిపోని నిందలు వేస్తున్నారని అన్నారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని, ఎన్జీవో సంస్థ ఆశ్రే ఆకృతిలో తాను పనిచేస్తుంటానని, చెవిటి, మూగ పిల్లలకు తాను వంట చేసి పెడతానని, తమకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని చెప్పారు.

తాను నెలకు పదిహేను వేల రూపాయల వరకు సంపాదిస్తానని చెప్పిన సతీష్ చంద్ర, తన భార్య శిరీష కేవలం ఆర్జే స్టూడియోలో మాత్రమే పనిచేస్తుందని అందరూ అనుకుంటున్నారని, వాస్తవానికి..  బెంగళూరుకు చెందిన గెట్ లుక్ సర్వీసెస్ అనే ఆన్ లైన్ బ్యూటీ సర్వీసెస్ లో కూడా ఆమె పనిచేస్తుందని చెప్పారు. సుమారు ఏడాది నుంచి శిరీష అక్కడ పనిచేస్తోందని, నెలకు ముప్పై నుంచి నలభై వేల వరకు డ్రా చేసేదని తెలిపారు. ఆర్జే స్టూడియోలో శిరీష చేరి సుమారు ఆరు నెలలు అవుతుందని, పార్ట్ టైమ్ గా చేరిందని చెప్పారు.

  • Loading...

More Telugu News