: మార్కెట్లోకి సరికొత్త పల్సర్.. ఎన్ఎస్160
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త పల్సర్ బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పల్సర్ ఎన్ఎస్160 పేరుతో ఇది వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర (ముంబై) రూ. 80,648గా ఉంది. ఈ బైక్ సామర్థ్యం 160 సీసీ. దీనికి ఐదు గేర్లు ఉన్నాయి. 160సీసీ బైక్ లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఎన్ఎస్160ని మార్కెట్లోకి తీసుకొచ్చామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ ఎరిక్ వాన్ అన్నారు. అత్యాధునిక సామర్థ్యంతో దీన్ని తయారు చేశామని చెప్పారు. యూత్ ను ఈ బైక్ ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు.