: సబర్మతి ఆశ్రమంలో నిన్న మోదీ చేసిన పనినే.. ఈ రోజు మీరాకుమార్ చేశారు!
భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా నిన్న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమంలోని చరఖాను తిప్పారు. ఈ రోజు కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన మీరాకుమార్ కూడా సబర్మతి ఆశ్రమంలో నేడు చరఖా తిప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తన ప్రచారాన్ని ప్రారంభించిన మీరాకుమర్... దాదాపు 40 నిమిషాల పాటు ఆశ్రమంలో ఉన్నారు. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తిని పొందడానికే తాను ఇక్కడకు వచ్చానని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ప్రస్తుతం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు దళిత వ్యక్తుల మధ్య పోరాటం కాదని... సిద్ధాంతాల మధ్య పోరు అని చెప్పారు.