: ఒకరి తప్పును మొత్తం కులంపై రుద్దుతున్న తెలుగుదేశం: జగన్ నిప్పులు


కేవలం ఒకరిద్దరు వ్యక్తులు చేసిన తప్పును మొత్తం కులంపై రుద్ది ఒక గ్రామంలో తగాదాలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని వైకాపా అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో పర్యటించిన ఆయన, దళితులతోనూ, దళితేతరులతోనూ మాట్లాడారు. ఈ గ్రామంలో సంచలనం కలిగించిన సాంఘిక బహిష్కరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనే వచ్చానని, సమాజంలో అందరూ కలసి ఉండాలన్నదే తన అభిమతమని అన్నారు. ప్రతి కులంలో మంచి, చెడులు ఉన్నాయని, ఒకరి తప్పును కులమంతటికీ ఆపాదించడం సరికాదని అన్నారు. పొరపాట్లు జరిగి వుంటే సర్దుకుపోవాలని, దానివల్ల గ్రామ ఔన్నత్యం పెరుగుతుందని అన్నారు. అందరినీ సంతోష పెట్టాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చానని అన్నారు. కాగా, తాము దళితులతో సోదర భావంతోనే ఉంటున్నామని, అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని, కానీ, కొంతమంది మాత్రం సమస్యను పెద్దది చేస్తున్నారని దళితేతరులు జగన్ కు ఫిర్యాదు చేశారు. సమస్యను తమకే వదిలి వేయాలని, తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News