: సెహ్వాగ్ గురించి ఆలోచిస్తేనే ఆందోళన కలుగుతోంది: బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి


భారత క్రికెట్ టీమ్ కు కొత్త కోచ్ పదవికి మాజీ క్రికెెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రవిశాస్త్రిల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్న వేళ, సెహ్వాగ్ కు మద్దతుగా నిలిచిన బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. సెహ్వాగ్ ను కోచ్ గా ఎంపిక చేస్తే, ముందు తన నోటిని అదుపులో పెట్టుకోవాల్సి వుంటుందని అన్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి వివిధ రకాల పోస్టులు పెడుతుండే సెహ్వాగ్ గురించి ఈ విషయంలో తనకు ఆందోళనగా ఉందని చెప్పాడు. జట్టుకు కోచ్ గా సెహ్వాగ్ ఎంపికైతే, సంయమనంతో ఉండాల్సిందేనని, కొన్ని షరతులకు లోబడాల్సి ఉంటుందని తెలిపాడు. మ్యాచ్ ఓడిపోయినా, సిరీస్ కోల్పోయినా, ఆచితూచి మాట్లాడాల్సి వుంటుందని, లేకుంటే కష్టాలు తప్పవని, సెహ్వాగ్ వైఖరే తనకు భయాన్ని కలిగిస్తోందని అన్నాడు.

  • Loading...

More Telugu News