: ర‌బ్బర్‌ సింగో, గబ్బర్‌ సింగో.. ప్ర‌శ్నిస్తాన‌న్న మొనగాడు ఇప్పుడెక్క‌డున్నాడు?: పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్


సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు వైసీపీ ప్లీనరీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... ప‌వ‌న్ క‌ల్యాణ్ ర‌బ్బ‌ర్ సింగో, గ‌బ్బ‌ర్ సింగో తేల్చుకోవాల‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌శ్నిస్తానన్న మొనగాడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడెక్క‌డున్నార‌ని ఆమె నిల‌దీశారు. కాపులను ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తుంటే పవన్ ప్ర‌భుత్వాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని ఆమె అడిగారు.

చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌న‌ని చెప్పుకున్న జ‌న‌సేనాని ఇప్పుడు జీఎస్టీ వ‌ల్ల ప‌డ‌బోతున్న ప‌న్నుపోటు గురించి ఎందుకు అడ‌గ‌డం లేద‌ని ఆమె విమ‌ర్శ‌లు చేశారు. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నేత‌లపై కూడా రోజా నిప్పులు చెరిగారు. గిరిజ‌నుల‌ ఓట్ల కోసం కొండలు ఎక్కి వారిని క‌లిసే రాష్ట్ర‌మంత్రులు.. ఇప్పుడు గిరిజ‌నుల ఆరోగ్యాలు పాడైపోతుంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News