: తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ!


తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తూ కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజులు విస్తృతంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో, చాపరాయి జ్వర పీడితులకు వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. గిరిజన పాఠశాలలో జ్వరాల బారిన పడిన విద్యార్థులకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలందిసున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 600కు పైగా గిరిజన గూడెంలను రెవెన్యూ, వైద్య బృందాలు సందర్శించాయని, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న 50 మందిని ఆసుపత్రికి తరలించినట్టు కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News