: రాంగ్ రూట్ లో వచ్చిందే కాక, ట్రాఫిక్ పోలీసును చితక్కొట్టాడు!


రాంగ్ రూట్ లో వస్తున్న వాహనదారుడిని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి దిగిన సంఘటన పంజాబ్ లోని పాటియాలాలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇరవైతొమ్మిది సంవత్సరాల హిమాన్షు మిత్తల్ అనే వ్యక్తి తన బీఎండబ్ల్యూ కారులో రాంగ్ రూట్ లో వస్తుండటాన్ని విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓం ప్రకాశ్ గమనించాడు.

వెంటనే, అతని కారుని అడ్డుకుని, లైసెన్స్, సంబంధిత పత్రాలు చూపించాలని ఓం ప్రకాశ్ ను కోరాడు. అందుకు నిరాకరించిన మిత్తల్, ఓం ప్రకాశ్ పై దుర్భాషలాడుతూ దాడికి దిగాడు. అతని చెంపపై వాయించేశాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం కాస్తా, గొడవకు దారి తీసింది. ఇదంతా గమనిస్తున్న అక్కడున్న వారు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కాగా, నాన్ బెయిలబుల్ వారెంట్ కింద మిత్తల్ ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News