: 'డీజే' సినిమాలో పూజా హెగ్డే రెమ్యునరేషన్ ఎంత? ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తోంది?
'దువ్వాడ జగన్నాథమ్' సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా ఆసాంతం పూజ చాలా గ్లామరస్ గా కనిపించింది. ఓ సీన్ లో బికినీలో కూడా కనువిందు చేసింది. దీంతో, పూజకు టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మరో విషయం ఏమిటంటే, ఇప్పటికే తెలుగులో రెండు సినిమాల్లో నటించిన పూజ... ఆ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటించిన 'మొహంజదారో' చిత్రంలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ... బాలీవుడ్ లోనే మకాం వేయాలని ఆమె భావించింది.
ఈ నేపథ్యంలో, తనకు వచ్చిన 'డీజే' ఆఫర్ ను పూజా హెగ్డే తిరస్కరించిందట. అయితే నిర్మాత అల్లు అరవింద్ తనకు సన్నిహితుడైన మరో నిర్మాతతో పూజకు అన్ని విషయాలు చెప్పించి, ఆమెను ఒప్పించాడు. చివరకు రూ. 70 లక్షల రెమ్యునరేషన్ తో సినిమా చేయడానికి పూజ ఒప్పుకుందట. ఇప్పుడు డీజే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో... తన రెమ్యునరేషన్ ను ఏకంగా రూ. కోటిన్నరకు పెంచేసిందట.