: విష్ణుకుమార్ రాజు నోటికి చంద్రబాబు తాళం వేశారు: రోజా


విశాఖ భూ కుంభకోణం విచారణ పక్కదోవ పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అన్నారు. భూ కుంభకోణం జరిగిందంటూ మీడియా ముందు చెప్పిన అయ్యన్న ఇప్పుడు సైలెంట్ అయిపోయారని విమర్శించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన గంటా కూడా సైలెంట్ అయిపోయారని అన్నారు. భూ వివాదాలపై మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా నోరు మెదపడం లేదని... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి సాయంతో విష్ణుకుమార్ రాజు నోటికి చంద్రబాబు తాళం వేశారని విమర్శించారు.

  • Loading...

More Telugu News