: ఇక ప్రాంతీయ భాషల్లో కూడా రైలు టిక్కెట్లు!
సంక్రాంతిలోగా రైలు టిక్కెట్‌పై వివరాలను హిందీ, ఇంగ్లిషులతో పాటు ఆయా జోన్లకు చెందిన ప్రాంతీయ భాషల్లో కూడా ముద్రించే ప్రయత్నం చేస్తామని రైల్వే బోర్డు తెలిపింది. తమిళనాడు బీజేపీ సభ్యుడు హెచ్ హరి అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన ప్యాసింజర్ ఎమినిటీస్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టికెట్ మీది వివరాలు అర్థంకాక ఫైన్ కట్టాల్సి వస్తున్నట్లు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఏసీ తెలిపింది. రానున్న ఆరు నెలల్లో టికెట్ ప్రింటింగ్ మిషన్లలో సాఫ్ట్‌వేర్లను హిందీ, ఇంగ్లిష్‌తో పాటు తమిళ్, తెలుగు, గుజరాతీ, ఒడియా భాషల్లో ముద్రించే విధంగా మార్పు చేస్తామని రైల్వే బోర్డు వివరించింది.