: దుబాయ్ ను అలరించనున్న ఐపీఎల్?


ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు. బీసీసీఐ నిర్వహించే ఈ టోర్నీని వీక్షించేందుకు విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు వస్తుంటారు. ఈ టోర్నీలో ఆడేందుకు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా క్యూ కడుతుంటారు. ఇంత క్రేజ్ ఉన్న ఈ టోర్నీని భారత్ కు వెలుపల నిర్వహించేందుకు బీసీసీఐ కృషి చేస్తోంది. దుబాయ్ లో మినీ ఐపీఎల్ ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా మీడియాకు తెలిపారు. మినీ ఐపీఎల్ ను నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నాయని.... ఈ చర్చలు సత్ఫలితాన్ని ఇస్తే మినీ ఐపీఎల్ ను దుబాయ్ లో నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News