: అక్బరుద్దీన్ పై కత్తులతో దాడి కేసులో తీర్పు నేడే!


2011 ఏప్రిల్ 30న బార్కాస్ ప్రాంతంలో అప్పటి చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై మహ్మద్ బిన్ ఒమర్ అలియాస్ మహ్మద్ పహిల్వాన్ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 మంది అక్బరుద్దీన్ ను చుట్టుముట్టి కత్తులతో హతమార్చేందుకు ప్రయత్నించగా, అక్బరుద్దీన్ గన్ మెన్ కాల్పుల్లో దాడికి పాల్పడ్డ వారిలో ఇబ్రాహీం బిన్ యూనిస్ యాఫై అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో తీవ్రమైన కత్తిపోట్లకు గురైన అక్బరుద్దీన్ ఒవైసీ ఇంచుమించు చావు అంచుల దాకా వెళ్లి, సుదీర్ఘ కాలం చికిత్స తీసుకుని, బతికి బట్టకట్టారు. ఈ దాడికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, చార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ కాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో పాతబస్తీలో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. 

  • Loading...

More Telugu News