: చెవిరెడ్డీ, ఆరోగ్యం జాగ్రత్త: జగన్ పరామర్శ
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన డంపింగ్ యార్డును తరలించాలని దీక్షచేపట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. చెవిరెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందన్న వైద్యుల హెచ్చరికల నేపథ్యంలో జగన్ ఆయనకు ఫోన్ చేసి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
చిత్తూరు సబ్ జైలులో దీక్ష చేపట్టిన ఆయన, బెయిల్ పై విడుదలైన అనంతరం కేసీపేటలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో ఆయనకు చికిత్స చేసిన డాక్టర్ కాజల్ ఆనంద్ ఆయన బీపీ 106/67కు, షుగర్ లెవెల్ 79కి పడిపోయినట్లు గుర్తించారు. దీక్ష ఇంకా కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షిణించే ప్రమాదం ఉందని, కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన దీక్షను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. డంపింగ్ యార్డు తరలిస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.