: రవితేజ సోదరుడు భరత్ తన పెంపుడు శునకాలతో ఉన్న వీడియో!
ప్రముఖ హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు మృతి చెందిన అనంతరం, ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భరత్ కు తన కుటుంబంతో ఉన్న విభేదాలు, ఆయన అలవాట్లు, మృతి చెందిన వార్తను ఆలస్యంగా బయటకు చెప్పడం, అంత్యక్రియలకు ముఖ్యమైన కుటుంబసభ్యులు హాజరు కాకపోవడం గురించి మీడియాలో వార్తలు మార్మోగిపోయాయి. తాజాగా, భరత్ కు శునకాలంటే ఇష్టమని, ఆయన నివాసంలో పెంపుడు శునకాలు ఉన్నట్టు తెలియజెప్పే వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ వీడియోలో చిన్న కుక్కపిల్లలతో భరత్ ఉండటం కనపడుతుంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయం తెలియదు. సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.