: పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలన్నీ ఆర్టీసీ, రవాణా శాఖలోనే ఉన్నాయి: ఎంపీ కేశినేని నాని


ఆర్టీసీ, రవాణా శాఖలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో తనకు తెలుసని, పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలన్నీ ఆర్టీసీ, రవాణా శాఖలోనే ఉన్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆర్టీసీ కార్మిక పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ ఆపరేటర్ గా తాను కోటి రూపాయలకు వోల్వో బస్సు కొనుగోలు చేశానని, అదే ఆర్టీసీలో అయితే, ఒక కోటి పది లక్షల రూపాయలుగా లెక్క చెబుతారని ఆరోపించారు. వాహనం చాసిస్ ను రూ.10 లక్షలకు తాను కొనుగోలు చేస్తానని, ఆర్టీసీలో అయితే రూ.12 లక్షలని చెబుతారని, బస్సు టైరు రూ.10 వేలు అయితే, ఆర్టీసీలో రూ.11 వేలకు కొన్నట్టు చూపిస్తారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News