: మెట్రో నగరాల్లో చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు!
టమాటా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా పంట నాశనమవడంతో వాటి కొరత ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా, ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో టమాటా ధరలు తార స్థాయిలో ఉన్నాయి. ఢిల్లీలో కిలో టమాటా ధర రూ.60 -70, కోల్ కతాలో రూ.50, ముంబయి, చెన్నై, హైదరాబాద్ లలో రూ.40 - 45 మధ్యలో ఉంది. అయితే, ఢిల్లీలో టమాటా ధర ఆ రేంజ్ లో ఉండటానికి ప్రధాన కారణం హరియాణాలో సాధారణం కంటే భారీగా వర్షాలు కురవడం కాగా, దాదాపు డెభ్బై శాతం టమాటా పంట నేలపాలైంది. దీంతో, పంట దిగుబడి తగ్గడంతో ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో టమాటా ధర అధికంగా పెరిగినట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.