: పని చేయని బోర్లని పూడ్చని యజమానులపై కొరడా! జరిమానా విధిస్తామన్న మంత్రి జూపల్లి


పనిచేయని బోర్లని పూడ్చకుండా అలానే వదిలివేయడంతో అభంశుభం తెలియని చిన్నారులు వాటిలో పడి, ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషాద సంఘటనలకు చెక్ పెట్టే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. పనిచేయని బోర్లను పూడ్చని యజమానులకు జరిమానా విధించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఈ అంశంపై ఈ రోజు సమీక్ష నిర్వహించారు. పనిచేయని బోర్ల మూసివేతపై రేపటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు చెప్పారు.

పనిచేయని బోర్లను పూడ్చేందుకు జులై 10 డెడ్ లైన్ గా విధించామని, వాటిని పూడ్చివేయని యజమానులకు రూ.50 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇకపై బోర్లు వేయాలంటే 15 రోజుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, అనుమతిలేని బోర్లపై రూ. లక్ష వరకు జరిమానా విధిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News