: రోడ్డు ప్రమాదంలో ‘బంగ్లా’ మాజీ క్రికెటర్‌కి, కుటుంబసభ్యులకు గాయాలు


బంగ్లాదేశ్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్, ఆయన కుటుంబసభ్యులు గాయపడ్డారు. కుల్నాలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం నిన్న మధ్యాహ్నం కారులో తిరిగి ఇంటికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. గోపాల్ గంజ్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న కాల్వలోకి కారు దూసుకెళ్లడంతో రజాక్, అతని భార్య, రెండేళ్ల కుమారుడు, సోదరి, ఇద్దరు మేనకోడళ్లు స్వల్పంగా గాయపడ్డారు. స్థానిక కుల్నా వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ముష్ఫాకర్ రహీమ్ తెలిపాడు. రజాక్ త్వరగా కోలుకునేలా ప్రార్థనలు చేయాలని ఈ సందర్భంగా అభిమానులను కోరాడు. 

  • Loading...

More Telugu News