: 70 కి.మీ స్పీడ్ తో వెళ్తున్న కారు టాప్ పై కూర్చొని పోజు కొట్టిన యువతి!
నేటితరం యువత పోకడలే వేరు.. రోడ్డుపై అందరిలా ప్రయాణం చేస్తే తమ స్పెషాలిటీ ఏముంటుందని రయ్ మంటూ వంద కిలోమీటర్ల వేగంతో బైకుని, కారుని నడిపేవారు కొందరైతే, రద్దీగా ఉన్న రహదారిపై కాళ్లతో బైకును నడుపుతూ వెళ్లేవారు మరికొందరు. ఇటువంటి దుస్సాహసాలకే పాల్పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చైనాలోని నంగ్జియాలో ఓ యువతి వారందరి కంటే డిఫరెంట్‌గా ఏదైనా చేయాలనుకుందేమో, దుస్సాహసం చేసింది.
70 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కారు టాప్ మీద హాయిగా కూర్చొని ప్రయాణం చేసింది. రోడ్డుపక్కన ఉన్నవారు, వేరే వాహనాలపై వెళుతున్న వారు ఆమెను చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా ఆమె నవ్వుతూ, పోజులిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. కొందరు ఈ దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరకు ఆ వీడియో పోలీసుల వద్దకు వెళ్లడంతో ఆమె ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిందని ఫైన్ వేశారు.