: స్పైస్‌ జెట్ ‘మెగా మాన్‌సూన్‌ సేల్‌’ ఆఫర్... రూ.699కే విమాన టికెట్‌!


‘మెగా మాన్‌సూన్‌ సేల్‌’ పేరుతో తాము రూ.699కే పలు రూట్ల మధ్య విమాన టికెట్‌లను అందించే అద్భుత ఆఫర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్ ప్ర‌కటించింది. నిర్ణీత సంఖ్య‌లో మాత్ర‌మే ఉన్న ఈ టికెట్ల‌ను ఈ రోజు నుంచి వ‌చ్చేనెల‌ 4 వరకు బుక్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. బుకింగ్‌లు చేసుకున్న ప్రయాణికులు వ‌చ్చేనెల‌ 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది.

జమ్ము-శ్రీనగర్‌, గువహటి-అగర్తలా, ఐజ్వాల్‌-గువహటితో పాటు మరికొన్ని మార్గాల్లో ప్ర‌యాణించాల‌నుకుంటున్న ప్ర‌యాణికుల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. బుకింగ్ చేసుకున్న ప్ర‌యాణికుల‌కు మ‌రో ఆఫ‌ర్‌ను కూడా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపింది. వారిలో ప‌లువురిని లక్కీడ్రాలో ఎంపిక చేసి దుబాయ్‌, మాలే, కొలంబో, బ్యాంకాక్‌ వెళ్లేందుకు హాలిడే ప్యాకేజ్‌ను ఆఫ‌ర్ చేయ‌నున్న‌ట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News