: నడిరోడ్డుపైనే భార్యను చంపేసిన కసాయి భర్త


న‌డిరోడ్డుపైనే త‌న భార్యను గొంతుకోసి చంపేశాడు ఓ క‌సాయి భ‌ర్త‌. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మృతురాలి పేరు సమీరాగా గుర్తించారు. ఈ దారుణానికి పాల్ప‌డ్డ ఆమె భర్త శ్రీనివాస్ కోసం గాలిస్తున్న‌ట్లు తెలిపారు. వీరిద్ద‌రు కొన్ని నెల‌ల క్రిత‌మే ప్రేమ వివాహం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ఈ దారుణానికి ఎందుకు పాల్ప‌డ్డాడ‌న్న విష‌యం తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News