: ఢిల్లీ అసెంబ్లీలోకి దూసుకెళ్లి... మంత్రిపై పేపర్‌ రాకెట్లు విసిరిన ఇద్దరు యువకులు!


ఢిల్లీ అసెంబ్లీలో ఈ రోజు అల‌జ‌డి చెల‌రేగింది. ఇద్దరు యువకులు అసెంబ్లీలోకి దూసుకువ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేశారు. సెక్యూరిటీ సిబ్బందితో తాము ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ కార్యకర్తలమని చెప్పిన ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు నేరుగా అసెంబ్లీలోకి వెళ్లిపోయి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ పై పేపర్‌ రాకెట్లు విసిరారు. సత్యేందర్‌పై ప్ర‌తిప‌క్ష పార్టీలు అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపైనే నినాదాలు చేస్తూ ఆ ఇద్ద‌రు యువకులు ఇలా ప్ర‌వ‌ర్తించారు. దీంతో మండిప‌డ్డ ఆప్‌ ఎమ్మెల్యేలు ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై దాడి చేశారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న‌ పోలీసులు ఆ ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News