: శాశ్వతంగా మూగబోనున్న ‘గూగుల్ టాక్’!


ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కు చెందిన ‘గూగుల్ టాక్’ సర్వీసు శాశ్వతంగా మూగబోనుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటన చేశారు. గూగుల్ టాక్’ సర్వీసు స్థానే ‘హ్యాంగవుట్స్’ను ప్రవేశపెట్టింది. ‘గూగుల్ టాక్’ ఇంకా ఎంతో కాలం అందుబాటులో ఉండదని, దీనిని వినియోగించే యూజర్లను ‘హ్యాంగవుట్స్’ వినియోగించే దిశగా మళ్లిస్తామని పేర్కొన్నారు. కాగా, ‘గూగుల్ టాక్’ ను శాశ్వతంగా నిలిపి వేసే విషయాన్ని ఈ ఏడాది మార్చిలో ‘గూగుల్’ ప్రతినిధులు ప్రకటించారు. తమ అప్లికేషన్స్ అన్నీ సింపుల్ గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలనే లక్ష్యంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 2005లో మెస్సేజింగ్ అప్లికేషన్ ‘గూగుల్ టాక్’ను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News