: ​రజనీ రాజకీయాలు తప్పా రాష్ట్రంలో వేరే సమస్యలు లేవా?: మీడియాపై మండిపడ్డ నటి కస్తూరి


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? లేదా? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు రజనీ రాజకీయ ప్రవేశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి రజనీకాంత్ వచ్చే విషయమై నాన్చుడి ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ నటి కస్తూరి ఇటీవల వ్యాఖ్యానించడంపై రజనీ అభిమానులు మండిపడటం తెలిసిందే.

అయితే, తానూ రజనీ అభిమానినేనని, అందుకే, ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పిన కస్తూరి, ఆ తర్వాత రజనీతో సమావేశమై ఆశ్చర్యపరిచింది. దీంతో, కస్తూరి కూడా రాజకీయాల్లోకి రావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తాజాగా, ఇదే అంశంపై మీడియా ఆమెను ప్రశ్నించగా, రజనీ, రాజకీయాలు తప్పా వేరే సమస్యలు లేవా? తమిళనాడు రాష్ట్రంలో అంతకుమించిన సమస్యలు లేవా? అంటూ మీడియాపై కస్తూరి మండిపడింది.

  • Loading...

More Telugu News