: నేను ఈ సినిమా గురించి మాట్లాడే ముందు.. మంత్రి గంటా శ్రీనివాస రావు గురించి చెబుతా: అల్లు అర్జున్
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవి హీరోగా తెరకెక్కిన ‘జయదేవ్’ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడకను ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ వేడుకకి హాజరైన హీరో అల్లు అర్జున్ వేదికపై మాట్లాడుతూ.. ముందుగా తాను గంటా శ్రీనివాస రావు గురించి మాట్లాడాలనుకుంటున్నానని అన్నాడు. తమతో గంటాకు చాలా లాంగ్ జర్నీ ఉందని, అది పర్సనల్‌గా, రాజకీయపరంగా ఉందని చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవిని గంటా శ్రీనివాసరావు ఇష్టపడతారని, ఆయనకు చిరంజీవిపై ఉన్న ఇష్టం వల్ల తనకు గంటాపై ఇష్టం మరింత పెరిగిందని వ్యాఖ్యానించాడు. తాను ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉందని గంటా శ్రీనివాస రావు తనతో అన్నారని చెప్పిన బన్ని.. గంటా కోసం తాను ఇక్కడికి వచ్చినందుకు తనకు కూడా ఆనందంగా ఉందని తెలిపాడు.