: ఢీ కొట్టిన కారు..స్కూటర్ సహా మహిళను ఈడ్చు కెళ్లిన వైనం!
స్కూటర్ నడుపుతున్న ఓ మహిళను ఢీ కొట్టిన కారు, కొంతదూరం వరకూ ఈడ్చు కెళ్లిన దారుణ సంఘటన రాజస్థాన్ లో ఈ రోజు జరిగింది. మౌంట్ అబూ ప్రాంతంలో స్కూటర్ నడుపుతూ వెళుతున్న మహిళ వాహనాన్ని ఓ కారు ఢీ కొట్టింది. స్కూటర్ సహా మహిళను సుమారు వందమీటర్ల దూరం వరకు కారు ఈడ్చుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అక్కడ ఉన్న పాదచారులు వెంటనే అప్రమత్తమై, సదరు కారును ఆపి, డ్రైవర్ ను బయటకు లాగి చితగ్గొట్టారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు. క్షతగాత్రురాలిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి సంభవించిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.