: సైనికులపై ఆజంఖాన్ విపరీత వ్యాఖ్యలు.. కలకలం!


అనునిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రాజకీయవేత్తల్లో సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ తొలి వరుసలో ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. మహిళలపై అరాచకాలకు, అత్యాచారాలకు పాల్పడే సైనికులపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. రేప్ లకు పాల్పడే సైనికులపై ప్రతీకార చర్యలకు దిగాలని, వారి మర్మాంగాలను కోసివేయాలని అన్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల దారుణాలు పెరిగిపోతున్నాయని అన్నారు. 60 ఏళ్ల తర్వాత భారతదేశం దారి తప్పిందని... బ్యాలెట్ వదిలి, బుల్లెట్ విధనాన్ని ఎంచుకుందని చెప్పారు.

  • Loading...

More Telugu News