: వైజాగ్, కాకినాడ, కరీంనగర్ లకు ఎయిర్ అంబులెన్స్ సేవలను విస్తరించిన అపోలో హాస్పిటల్స్


అపోలో హాస్పిటల్స్ మరో ఘనతను సాధించింది. గతంలో ప్రారంభించిన ఎయిర్ అంబులెన్స్ సేవలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించింది. బెంగళూరుకు చెందిన విమానయాన సంస్థ ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూతో కలసి ఈ సేవలను అపోలో హాస్పిటల్స్ నిర్వహిస్తోంది. తాజాగా వైజాగ్, కాకినాడ, కరీంనగర్, కరైకుడి, కరూర్, మధురై, తిరుచిరాపల్లి, మైసూర్ నగరాలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ ప్రీథా రెడ్డి తెలిపారు.

2003లో ఎయిర్ అంబులెన్స్ సేవలను ఈ అపోలో ప్రారంభించింది. తొలి విడతలో ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకు ఈ సేవలను అందించింది. ప్రతి ఏటా 125 నుంచి 150 మంది రోగులను ఈ సర్వీసుల ద్వారా చేరవేస్తోంది. ఈ సేవలకు గాను గంటకు రూ. 1.60 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేయనున్నట్టు ప్రీథా రెడ్డి తెలిపారు.  

  • Loading...

More Telugu News