: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా విడుదల తేదీ ఖరారు!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు బీవీఎస్ రవి రూపొందించిన జవాన్ సినిమా విడుదల తేదీని ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నామని జవాన్ టీమ్ పేర్కొంది. ఈ సినిమాలోని సాయిధరమ్ తేజ్, మెహరీన్‌ల పలు పోస్టర్లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. 'ఇంటికొక్కడు' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాలో హీరో కుటుంబానికి ప్రాధాన్యతనిస్తాడా? లేక దేశానికి ప్రాధాన్యతనిస్తాడా? అనే అంశంతో కథ సాగుతుంది.