: మోదీని కలిసినందుకు సంతోషంగా ఉంది: సురేశ్ రైనా
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా, ఆయన భార్య ప్రియాంక ఫొటో దిగి హర్షం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్ ఆమ్‌స్టర్‌డమ్ పర్యటనకు వెళ్లిన మోదీని తాము కలిసినట్లు రైనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తాము మోదీతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. మోదీ గోల్డన్ విజన్ ఉన్న వ్యక్తి అని పేర్కొన్న రైనా.. ప్రధాని చేసిన నెదర్లాండ్స్ పర్యటన నిర్మాణాత్మకమని అన్నాడు. ప్రస్తుతం రైనా తన భార్య ప్రియాంకతో కలిసి యూరప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగానే అక్కడే ఉన్న మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు.