: నారాయణ కాలేజీలో వివాదం ఏమీ లేదు... అది పాడైపోయిన ఫర్నిచర్: యాజమాన్యం
హైదరాబాదులోని కూకట్ పల్లి పరిధిలోని నిజాంపేట్ క్రాస్ రోడ్డులోని నారాయణ విద్యాసంస్థలో విద్యార్థులు విధ్వసం సృష్టించిన సంగతి తెలిసిందే. సిబ్బందిని గదిలో బంధించిన సీనియర్ ఇంటర్ విద్యార్థులు...కళాశాలలోని మూడు అంతస్తుల్లో ఫర్నిచర్ ను ధ్వసం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కళాశాల యాజమాన్యం స్పందించింది. బ్రాంచ్ డైరెక్టర్ రామరాజు మాట్లాడుతూ, దుడుకు వయసులో విద్యార్థులు దూకుడుగా ఉంటారని, అందులో భాగంగా దూకుడుగా ప్రవర్తించారని అన్నారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని వారు చెప్పారు. నాలుగు రోజలు సెలువులు రావడంతో జూనియర్స్ ను సిక్ లీవ్ కు పంపగా, సీనియర్స్ ను స్టడీ అవర్స్ కోసం ఉంచామని, అయితే విద్యార్థులు తమను తప్పుగా అర్ధం చేసుకున్నారని, ఆ వయసులో ఇలాంటి దూకుడు మనస్తత్వం సాధారణమని, సరిదిద్దుతామని ఆయన తెలిపారు.