: ఆకాశాన ఆరో కన్ను... అదిరిపోయే నాణ్యతతో చిత్రాలను పంపిన కార్టోశాట్ -2
అంతరిక్షాన భారతావనికి ఆరో కన్నుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్న కార్టోశాట్-2, తన పని ప్రారంభించింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల చిత్రాలను అద్భుతమైన క్లారిటీతో తీసి, వాటిని భూమిపైకి పంపించగా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వాటిని విడుదల చేసింది. దోహా, ఖతార్ లోని మానవ నిర్మిత నౌకాశ్రయాలు, పంట పొలాలతో పాటు రాజస్థాన్ లోని ప్రాంతాలను హై రెజల్యూషన్ ఫార్మాట్ లో తీసి పంపింది. ఆ చిత్రాలను మీరూ చూడవచ్చు. కార్టోశాట్-2 పంపిన చిత్రాల్లోని ఎంపిక చేసిన వాటిని ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.