: అరెస్ట్ చేసి తీసుకురండి... బీజేపీ ఎంపీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఖర్చుల నిమిత్తం ప్రభాత్ సిన్హా ఠాకూర్ అనే వ్యక్తి నుంచి కోటిన్నర రూపాయలు రుణం తీసుకుని ఆపై చెల్లని చెక్కిచ్చి, బ్యాంకు విచారణకు పదేపదే గైర్హాజరైన కేసులో గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్ బీజేపీ ఎంపీ దేవ్ జీ ఫతేపురాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత దేవ్ జీ ఇచ్చిన చెక్కును ఠాకూర్ బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. ఆపై డబ్బు కోసం తన ప్రయత్నాలు విఫలం కావడంతో ఠాకూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. పంపిన నోటీసులకు దేవ్ జీ నుంచి స్పందన కరవవడంతో, కేసును విచారించిన న్యాయమూర్తి ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. ఆయన్ను తదుపరి విచారణ తేదీన కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించారు.