: భరత్ తాగుడుకు, డ్రగ్స్ కు అలవాటు పడటానికి కారణమిదేనా?
ప్రముఖ సినీ నటుడు రవితేజ సోదరుడు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో నటించిన భరత్ కు వాస్తవానికి సినిమాల్లో నటించాలనే కోరిక లేనేలేదట. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టకముందు ఆయన తన భార్యతో కలసి అమెరికాలో ఉండేవాడు. ఆ సమయంలో అక్కడ జరిగిన తానా సభలలో ఓ టాలీవుడ్ డైరెక్టర్ భరత్ కు పరిచయం అయ్యాడు. "చూడ్డానికి అచ్చం మీ అన్న రవితేజలాగానే ఉన్నావు... హైదరాబాద్ వస్తే, నిన్ను పెట్టి సినిమా తీస్తా" అని సదరు దర్శకుడు భరత్ కు మాట ఇచ్చాడట. దీంతో, భరత్ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. అయితే, హీరో వేషం కాదు కదా... చిన్న క్యారెక్టర్ వేషం కూడా సదరు డైరెక్టర్ భరత్ కు ఇవ్వలేదట. దీంతో, భరత్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడని... ఈ క్రమంలోనే మద్యానికి, డ్రగ్స్ కు బానిస అయ్యాడని సమాచారం.