: దివాకర్ ట్రావెల్స్ కు క్లీన్ చిట్ ఎలా? ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం


రెండు నెలల క్రితం కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు వాగులో పడిన దుర్ఘటనలో క్లీన్ చిట్ ఇవ్వడంపై తెలుగు రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ కేసులో తెలంగాణ, ఏపీ అధికారులు విడివిడిగా అఫిడవిట్ లు దాఖలు చేయగా, ఏపీ ప్రభుత్వం అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని, ఉల్లంఘనలు లేవని పేర్కొంది.

ఇదే సమయంలో తెలంగాణ రవాణా శాఖ చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్ లో మోటారు వాహన చట్టంతో పాటు కార్మికుల నిబంధనలు ఉల్లంఘించారని ఉంది. దీంతో ఈ రెండింటినీ పరిశీలించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, జస్టిస్‌ టి రజనిలతో కూడిన ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏపీ అఫిడవిట్‌ పై పలు సందేహాలున్నాయని పేర్కొంది. దివాకర్‌ ట్రావెల్స్‌ కార్యాలయం హైదరాబాద్‌ లో ఉన్నందునే తెలంగాణ ప్రభుత్వం అలా చెప్పిందని, కొంత గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తామని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. పూర్తి వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, న్యాయమూర్తులు మూడు వారాల గడువు ఇచ్చారు.

  • Loading...

More Telugu News