: చైనా బాక్సర్ తో ఆగస్టు 5న విజేందర్ సింగ్ డబుల్ ధమాకా పోరు
భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ డబుల్ ధమాకా పోరుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 5న చైనాకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్, ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ విజేత జుల్ఫికర్ మైమైతియాలి (చైనా)ని ఢీ కొట్టనున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన తరువాత అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న విజేందర్ సింగ్ ఆసియా ఫసిఫిక్ మిడిల్ వెయిట్ ఛాపింయన్ గా అవతరించాడు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 5న జరగనున్న పోరాటంలో ఇద్దరూ టైటిళ్లను ఫణంగా పెట్టి పోరాడనున్నారు. ఈ పోరులో ఓటమిపాలైతే ప్రైజ్ మనీతో పాటు తమ టైటిల్ నిలబెట్టుకుంటూ ప్రత్యర్థి టైటిల్ ను కూడా గెలుచుకుంటాడు. ఈ నేపథ్యంలో ఈ పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇప్పటికే వీరిద్దరూ కోచ్ లతో విజయం సాధించేందుకు వ్యూహరచన, ప్రాక్టీస్ లో మునిగిపోయారు.