: దురుసు ప్రవర్తన కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు


దురుసు ప్రవర్తన కారణంగా గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఈ రోజు ఉదయం పెనుమాకలో జరిగిన సీఆర్డీఏ సదస్సులో ఆయన దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేశారు. తమ పట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని పెనుమాక సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు   రామకృష్ణారెడ్డిపై 341, 353, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించిన రామకృష్ణారెడ్డి, తన అనుచరులతో అడ్డుకున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

  • Loading...

More Telugu News