: ‘ఫోర్బ్స్’ జాబితాలో నా పేరుంది కానీ, అంత డబ్బు మాత్రం నా దగ్గర లేదు: సల్మాన్ ఖాన్


‘ఫోర్బ్స్’ జాబితాలో తన పేరు ఉన్నంత మాత్రాన అంతడబ్బు తన దగ్గర ఎక్కడిదని బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ అంటున్నాడు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సెలబ్రిటీల జాబితాను ‘ఫోర్బ్స్’ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్ 100లో సల్మాన్ 71వ స్థానంలో ఉన్నాడు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో తన పేరు ఉంది కానీ, అంతడబ్బు తన వద్ద ఎక్కడుందా? అని ఆలోచిస్తుంటానని .. నిజంగా అంతడబ్బు తన వద్ద లేదని చెప్పాడు. తాము నటించిన సినిమాలు రూ.500 కోట్ల కలెక్షన్లు రాబట్టినంత మాత్రాన, ఆ డబ్బంతా తమకు రాదని, అందులో కొంత భాగమే తమ సొంతమవుతుందని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News