: ప్రభుత్వంపై రెండేళ్ల పోరాటానికి ప్లీనరీలో కార్యాచరణ రూపొందించనున్న వైసీపీ


వైసీపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం ముగిసింది. ప్లీనరీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఈ సమావేశాల్లో చర్చించారు. మరో రెండేళ్ల వరకు టీడీపీపై పోరాటానికి సంబంధించిన కార్యాచరణను ప్లీనరీలో సిద్ధం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. దానికి అనుగుణంగా ప్లీనరీలో తీర్మానాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్లీనరీని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వివిధ కమిటీలను ఏర్పాటు చేసే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ జరగనుంది. 

  • Loading...

More Telugu News